- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళపై అసభ్య ప్రవర్తన.. కామాంధుడికి అరగండు.. చెప్పుల దండ
కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికేరలో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి గ్రామస్తులు ఊహించని రీతిలో గుణపాఠం చెప్పారు...

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లా(Kurnool District) ఆలూరు మండలం అరికేర(Arikera)లో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఒక వ్యక్తికి గ్రామస్తులు ఊహించని రీతిలో గుణపాఠం చెప్పారు. రాజశేఖర్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన ఒక వివాహితను కొంతకాలంగా వేధిస్తూ, ఆమె పట్ల అమర్యాదగా ప్రవర్తించసాగాడు. నిందితుడి ఆగడాలు మితిమీరడంతో, బాధితురాలు ధైర్యంగా ఈ విషయాన్ని తన బంధువులకు వివరించింది. దీంతో ఆగ్రహానికి గురైన బంధువులు, గ్రామస్తులు కలిసి నిందితుడికి తగిన శాస్తి చేయాలని నిర్ణయించుకున్నారు.
కామంధుడికి అరగుండు.. మెడలో చెప్పుల దండ
బాధితురాలి సమాచారంతో నిందితుడు రాజశేఖర్‌ను పట్టుకున్న బంధువులు మొదట అతడికి దేహశుద్ధి చేశారు. అనంతరం మరో మహిళ పట్ల ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకూడదనే హెచ్చరికతో అతడికి సగం గుండు (అరగండు) కొట్టించారు. అంతటితో ఆగక, నిందితుడి మెడలో చెప్పుల దండ వేసి గ్రామంలోని పురవీధుల్లో ఊరేగించారు. బహిరంగంగా అవమానం ఎదురైతేనే ఇలాంటి వికృత చేష్టలు ఆగుతాయన్న ఉద్దేశంతో గ్రామస్తులు ఈ శిక్ష విధించారు.
చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడంపై భిన్నాభిప్రయాలు
ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ, మహిళల భద్రత విషయంలో రాజీ పడకూడదనే సందేశాన్ని ఈ ఘటన పంపిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. నిందితుడిని ఊరేగిస్తున్న సమయంలో తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వ్యవహారం జిల్లావ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.






