AP News : శ్రీవారి ఆలయ సెట్ తొలగిస్తామన్న మల్లేపల్లి మిలటరీ హోటల్

by Muthe.Rajitha |

మల్లేపల్లి మిలటరీ హోటల్లో(Mallepalli Military Hotel) ఇటీవల శ్రీవారి ఆలయ నమూనా సెట్(Srivari Temple Set) వేయడం వివాస్పదమైన సంగతి తెలిసిందే.

AP News : శ్రీవారి ఆలయ సెట్ తొలగిస్తామన్న మల్లేపల్లి మిలటరీ హోటల్
X

దిశ, వెబ్ డెస్క్ : మల్లేపల్లి మిలటరీ హోటల్లో(Mallepalli Military Hotel) ఇటీవల శ్రీవారి ఆలయ నమూనా సెట్(Srivari Temple Set) వేయడం వివాస్పదమైన సంగతి తెలిసిందే. అయితే నేడు ఈ హోటల్ యాజమాన్యం దిగివచ్చి ఆలయ నమూనా తొలగించేందుకు అంగీకరించింది. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మల్లేపల్లి వద్ద ఉన్న ‘రాయుడు గారి మిలటరీ హోటల్‌’లో తిరుమల ఆనంద నిలయం తరహాలో సెట్టింగ్ వేయడంపై భక్తులు, హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. కాగా టీటీడీ పాలకమండలి సభ్యుడు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ(MLA Jyothula Nehru)తోపాటు మరికొంతమంది స్వామిజీలు నేడు ఈ హోటల్ కు వెళ్ళి యాజమాన్యంతో చర్చించాయి.

మాంసాహారం వడ్డిస్తూ, విందులు చేసుకునే ప్రదేశంలో హిందువులు ఆరాధ్యదైవంగా భావించే వెంకటేశ్వరస్వామి ఆలయ నమూనాను ఏర్పాటు చేయడం హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుందని, తక్షణమే ఆలయ నమూనా తొలగించాలని కోరారు. హిందువుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఆలయ సెట్ ను 10 రోజుల్లో తొలగిస్తామని మిలిటరీ హోటల్ యాజమాన్యం ప్రకటించింది. దీంతో గత కొంతకాలంగా నెలకొన్న వివాదానికి చెక్ పడింది.

Next Story