- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ రాజకీయాలపై మల్లాది విష్ణు హాట్ కామెంట్స్
అంబటి రాంబాబు అరెస్టుతో గుంటూరులో యుద్ధ వాతావరణం. వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా మారుతున్న రాజకీయం.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ రాజకీయ (AP Politics) వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) నివాసంపై జరిగిన దాడి ఘటన రాష్ట్ర రాజకీయాల్లో (State Politics) పెను సంచలనంగా మారింది. అనంతరం ఆయనపై కేసు నమోదయ్యింది. పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచగా కోర్టు 14 రోజుల రిమాండును విధించింది. దీంతో దాడి నుంచి తేరుకోకముందే రాంబాబుకు జైలు శిక్ష పడడంతో ఆయన కుటుంబంలో కలకలం రేగింది. అయితే నిందితులపై కూటమి ప్రభుత్వం పోలీసులు ఇప్పటికే కేసులను నమోదు చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా వైసీపీ నేత మల్లాది విష్ణు ఈ దాడులపై చేసిన 'హాట్ కామెంట్స్' చర్చనీయాంశమయ్యాయి.
ఏపీలో బీహార్ తరహా దాడులు: మల్లాది విష్ణు ఫైర్
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో బీహార్ తరహా దాడులు జరుగుతున్నాయని వైసీపీ మల్లాది విష్ణు (Malladi Vishnu) ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అండదండలతోనే టీడీపీ (TDP) శ్రేణులు రెచ్చిపోతున్నాయని ఆయన మండిపడ్డారు. అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడి యాదృచ్ఛికం కాదు, ఇది రాష్ట్ర ప్రభుత్వమే దగ్గరుండి చేయించిన దాడి అని విష్ణు విమర్శించారు. వైసీపీ కార్యకర్తలు, నేతలపై కక్ష సాధింపు చర్యలు పెరిగిపోతున్నాయని, ప్రతిపక్ష గొంతు నొక్కేందుకు ప్రభుత్వం రౌడీయిజాన్ని (Rowdyism) ప్రోత్సహిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
పవన్ కల్యాణ్ స్పందించాలి: అంబటి కుమార్తె డిమాండ్
ఈ దాడి ఘటనపై అంబటి రాంబాబు కుమార్తె మౌనిక (Ambati Mounika) మీడియా ముందుకు వచ్చి భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. తమ ఇంట్లోకి జొరబడి హత్యాయత్నం చేసిన టీడీపీ నేతలపై కేవలం చిన్నచిన్న కేసులు పెట్టి పోలీసులు చేతులు దులుపుకున్నారని ఆమె ఆరోపించారు. మా నాన్న తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నప్పటికీ, ఇంతటి అరాచకానికి పాల్పడటం ఎంతవరకు సమంజసం? అని ఆమె ప్రశ్నించారు. ఒక కాపు నేతగా, రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని మౌనిక విజ్ఞప్తి చేశారు. కులాల మధ్య చిచ్చు పెట్టేలా జరుగుతున్న ఇలాంటి దాడులను ఆపాల్సిన బాధ్యత ఆయనపై ఉందని ఆమె పేర్కొన్నారు.
రంగంలోకి వైసీపీ అధినేత.. నేడు జగన్ పర్యటన
పార్టీ నేతలు, కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) నేడు గుంటూరులో పర్యటించనున్నారు. ప్రస్తుతం రాజమండ్రి జైలులో అంబటి రాంబాబు ఉన్నారు. ఈ నేపథ్యంలో స్వయంగా రాంబాబు కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు. అంబటి నివాసంలో జరిగిన విధ్వంసాన్ని పరిశీలించి, ఆయన భార్య, కుమార్తెలకు వైసీపీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో గుంటూరులో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
కార్యకర్తల్లో భరోసా నింపే ప్రయత్నం
అధికార మార్పిడి తర్వాత వరుసగా జరుగుతున్న దాడులతో వైసీపీ శ్రేణులు ఆందోళనలో ఉన్నాయి. ఈ క్రమంలో జగన్ స్వయంగా క్షేత్రస్థాయిలోకి రావడం ద్వారా పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహం నింపాలని భావిస్తున్నారు. ఈ పర్యటన ద్వారా ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడి పెంచడంతో పాటు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైసీపీ వ్యూహరచన చేస్తోంది.






