కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం.. అధికారులకు CM చంద్రబాబు కీలక ఆదేశాలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-24 03:07:37  IST  )

కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం.. అధికారులకు CM చంద్రబాబు కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు దగ్ధమైన ఘటనలో పలువురు చనిపోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాద ఘటనను అధికారులు దుబాయ్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎస్‌ విజయానంద్‌, కర్నూల్ ఎస్పీ విక్రాంత్ పాటిల్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. ఉన్నత స్థాయి యంత్రాంగం అంతా ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని హుటాహుటిన ఆదేశాలు జారీ చేశారు. క్షతగాత్రులకు, బాధితులకు అవసరమైన సహకారం అందించాలని.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం చంద్రబాబు సూచించారు.

Read More: ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం.. 20 మందికిపైగా సజీవ దహనం!

బస్సు ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన మంత్రి నారా లోకేష్

ఇప్పటి వరకు 11 మృతదేహాలు వెలికితీశాం.. కర్నూలు కలెక్టర్ సిరి కీలక ప్రకటన

బస్సు దగ్ధం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

Next Story