లిక్కర్ స్కాం కేసులో వాసుదేవరెడ్డికి భారీ ఊరట

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-04-17 14:39:58  IST  )

ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది..

లిక్కర్ స్కాం కేసులో వాసుదేవరెడ్డికి భారీ ఊరట
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ లిక్కర్ స్కాం కేసు(AP Liquor Scam Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ2 నిందితుడుగా ఉన్న వాసుదేవ రెడ్డికి (Vasudeva Reddy)కి భారీ ఊరట లభించింది. వాసుదేవరెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు(Acb Court) షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే ప్రతి నెలా 2, 4 సోమవారాల్లో అధికారుల ఎదుట విచారణకు హాజరవ్వాలని, పాస్‌పోర్ట్ సరెండర్ చేయాలని సూచించారు. లక్ష చొప్పున ఇద్దరు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదే కేసులో నిందితుడుగా ఉన్న ప్రణయ్ ప్రకాశ్ బెయిల్‌ పిటిషన్‌ను మాత్రం ధర్మాసనం డిస్మిస్ చేసింది. మరో ముగ్గురు నిందితులు ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణను పూర్తి చేసింది. తీర్పును ఈ నెల 24కి వాయిదా వేసింది.

Next Story