బుచ్చిలో భారీ అగ్నిప్రమాదం: సెకండ్ హ్యాండ్ వాహనాల దగ్ధం

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-04-29 13:47:20  IST  )

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు తీవ్ర కలకలం రేపాయి. స్థానిక లైలా హాల్ సమీపంలోని ఒక సెకండ్ హ్యాండ్ వాహనాల సేల్స్ పాయింట్ వద్ద ఈ ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో షెడ్డులో ఉన్న వాహనాలన్నీ పూర్తిగా కాలి బూడిదయ్యాయి...

బుచ్చిలో భారీ అగ్నిప్రమాదం: సెకండ్ హ్యాండ్ వాహనాల దగ్ధం
X

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం(Buchireddypalem)లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు( Fires) తీవ్ర కలకలం రేపాయి. స్థానిక లైలా హాల్ సమీపంలోని ఒక సెకండ్ హ్యాండ్ వాహనాల సేల్స్ పాయింట్ వద్ద ఈ ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో షెడ్డులో ఉన్న వాహనాలన్నీ పూర్తిగా కాలి బూడిదయ్యాయి. మంటలు భారీ స్థాయిలో ఎగసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. తమ కళ్లముందే వాహనాలు అగ్నికి ఆహుతవ్వడం చూసి వాహన యజమానులు, స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

జామాయిల్ తోటలకు...

అయితే,ఈ మంటలు కేవలం వాహనాలకు మాత్రమే పరిమితం కాకుండా పక్కనే ఉన్న జామాయిల్ తోటలకు కూడా వ్యాపించాయి. దీంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండటంతో స్థానికులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే రంగంలోకి దిగారు. సాహసోపేతంగా స్పందించిన ప్రజలు మంటలను అదుపు చేసేందుకు శ్రమించడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. సకాలంలో స్థానికులు స్పందించకపోయి ఉంటే ఆస్తి నష్టం మరింత భారీగా ఉండేదని తెలుస్తోంది

Next Story