ఏసీ పేలడంతో భారీ అగ్నిప్రమాదం

by Thanuru Gopichand |

పేలుతున్న గృహొపకరణాలు. ఆందోళనలో ప్రజలు.

ఏసీ పేలడంతో భారీ అగ్నిప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రమాదం ఎప్పుడు ఏ రూపంలో పొంచి ఉందో తెలియని పరిస్థితి. ఇంట్లో ఉన్నా రహదారులపైకి వచ్చినా మృత్యువు ఏదో ఒక రూపంలో కబళించేందుకు ముంచుకొస్తుంది. భూమిపై నూకలు ఉన్నవారు బ్రతికి బయటపడుతుంటే.. దురదృష్టవశాత్తూ కొందరు అకాల మరణం పొందుతున్నారు. దీంతో కుటుంబాల్లో విషాద ఛాయలు నెలకొంటున్నాయి. ఇంట్లో ఉన్న వాషింగ్ మెషీన్లు, ఏసీలు సైతం పేలుతూ అగ్ని ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అది యంత్రాలలోని లోపమో.. గ్రహాల ప్రభావమో తెలియడం లేదు. సాంకేతిక సమస్యలే కారణమైతే అధిక శాతం ఘటనలు వెలుగు చూడాలి. కానీ అక్కడక్కడ జరుగుతున్న ఘటనలు పలుమార్లు అనుమానాలకు తావిస్తున్నాయి.

అయితే విజయవాడలోని (Vijayawada) ఓ అపార్ట్మెంటులో అగ్నిప్రమాదం (Fire Accident in Apartment) జరిగింది. దానికి ఏసీ పేలడమే (AC Blast) కారణంగా తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడ భవానీపురంలో (Bhavanipuram) ఓ అపార్ట్మెంట్ ఉంది. అందులోని ఐదో అంతస్థులో ఉన్న ఓ ఫ్లాట్ లో ఒక్కసారిగా ఏసీ పేలింది. దీంతో మంటలు వ్యాపించాయి. ఫ్లాట్ అంతటా మంటలు విస్తరించాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల్లో చిక్కుకున్న వృద్ధులను కాపాడారు. తద్వారా ప్రాణ నష్టం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.

Next Story