విశాఖ ఐటీసీ గోదాంలో అగ్ని భారీ ప్రమాదం

by velandi.Saikiran |

విశాఖలో (Vizag) మరో పెను ప్రమాదం జరిగింది. విశాఖపట్నం గండిగుండం లోని ఐటిసి గోదాంలో (ITC Warehouse) ఘోర అగ్ని

విశాఖ ఐటీసీ గోదాంలో అగ్ని భారీ ప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్ : విశాఖలో (Vizag) మరో పెను ప్రమాదం జరిగింది. విశాఖపట్నం గండిగుండం లోని ఐటిసి గోదాంలో (ITC Warehouse) ఘోర అగ్ని ప్రమాదం ( Fire Accident) జరిగింది. సిగరెట్లు, బింగో ప్యాకెట్ల గోదాంలో.. మంటలు చెలరేగినట్లు చెబుతున్నారు. ఇవాళ ఉదయం పూట.. ఈ అగ్ని ప్రమాదం జరిగిందని అంటున్నారు. ఈ ప్రమాదం జరగగానే రంగంలోకి 8 ఫైర్ ఇంజన్ వాహనాలు దిగాయి. ప్రస్తుతం మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు అగ్నిమాపక అధికారులు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్... కారణమని చెబుతున్నారు. అయితే ఈ అగ్ని ప్రమాదం జరిగిన నేపథ్యంలో ప్రాణ నష్టం జరగలేదు కానీ.. ఆస్తి నష్టం విపరీతంగా జరిగింది. దీనిపై అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story