- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీశైల పుణ్యక్షేత్రంలో భారీ ప్రమాదం.. పాతాళగంగ దారిలో విరిగిపడిన కొండచరియలు
‘మొంథా’ తుపాను (Cyclone 'Montha') ప్రభావంతో శ్రీశైల (Srisaialam) మహాక్షేత్రంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: ‘మొంథా’ తుపాను (Cyclone 'Montha') ప్రభావంతో శ్రీశైల (Srisaialam) మహాక్షేత్రంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. పాతాళగంగ (Paathal Ganga)కు వెళ్లే దారిలో కొండచరియలు విరిగిపడ్డియాయి. ఈ దుర్ఘటనలో మొత్తం 3 షాపులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు భక్తులను అటువైపు వెళ్లేందుకు అనుమతించడం లేదు. పుష్కరిణికి వెళ్లే మార్గం పూర్తిగా శిథిలాలతో మూసుకుపోగా పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. మరోవైపు టూరిజం శాఖ ఆధ్వర్యలోని రోప్ వే (Rope Way) సర్వీసును కూడా తాత్కాలికంగా మూసివేశారు. తుపాను ప్రభావంతో కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కర్నూలు నగరం సహా కొత్తపల్లి, మహానంది, ఆత్మకూరు మండలాల్లో ఎడతెరిపి లేకుండా ముసురు పడుతోంది. మహానంది మండలం నందిపల్లి వద్ద పాలేరు వాగు వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. కొత్తపల్లి మండలంలో శివపురం పెద్దవాగు పొంగిపోర్లుతుండటంతో సమారు 11 గ్రామాల రాకపోకలకు అంతరాయం తీవ్ర అంతరాయం ఏర్పడింది.
READ MORE .....






