మదనపల్లె కిడ్నీ మార్పిడి కేసు.. లొంగిపోయిన డాక్టర్

by Ajay Maddhiboyina |

మదనపల్లె కిడ్నీ మార్పిడి కేసులో రెండో ప్రధాన ముద్ధాయి లొంగిపోయాడు. ఈ కేసులో ఏ2గా బెంగుళూరుకు చెందిన డాక్టర్ పార్థసారథి ఉన్నారు.

మదనపల్లె కిడ్నీ మార్పిడి కేసు.. లొంగిపోయిన డాక్టర్
X

దిశ, వెబ్ డెస్క్: మదనపల్లె కిడ్నీ మార్పిడి కేసులో రెండో ప్రధాన ముద్ధాయి లొంగిపోయాడు. ఈ కేసులో ఏ2గా బెంగుళూరుకు చెందిన డాక్టర్ పార్థసారథి ఉన్నారు. ఆయన కోర్టులో లొంగిపోవడంతో 14 రోజులు రిమాండ్ విధించారు. ఇప్పటికే ఈ కేసులో 8మంది నిందితులు అరెస్ట్ అవ్వగా మదనపల్లె సబ్ జైలులో ఉన్నారు. ఇక మరికొందరిపై కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ కిడ్నీ రాకెట్ వ్యవహారం రాష్ట్రంలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

కిడ్నీ డోనర్ నుండి రిసీవర్ వరకు కొంతమంది దళారులు ముఠాగా ఏర్పడి వ్యాపారం చేస్తున్నారు. మదనపల్లె నుండి బెంగళూరుకు కిడ్నీలను తరలించి అక్కడి ఆస్పత్రుల్లో రోగులకు అమరుస్తున్నారు. ఈ క్రమంలోనే వైజాగ్ కు చెందిన ముగ్గురకి డబ్బులు ఎరగా చూపి కిడ్నీలను బెంగుళూరు తరలించే ప్రయత్నం చేశారు. అయితే కిడ్నీ డోనర్ యమున చనిపోవడంతో కిడ్నీ రాకెట్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇందులో డాక్టర్లు, టెక్నీషియన్లు సహా చాలా మంది ఉన్నారు.

Next Story