పిచ్చి కుక్క స్వైరవిహారం.. 20 మందిపై దాడి

by Vemula.Srinu Prasad |

పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో పిచ్చి కుక్క స్వైరవిహారం చేసింది. వీధుల్లో వెళ్తున్న వారిపై ఒక్కసారిగా దాడి చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేసింది..

పిచ్చి కుక్క స్వైరవిహారం..  20 మందిపై దాడి
X

దిశ, వెబ్ డెస్క్: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ(Parvathipuram Manyam District Palakonda)లో పిచ్చి కుక్క స్వైరవిహారం(Mad dog wandering) చేసింది. వీధుల్లో వెళ్తున్న వారిపై ఒక్కసారిగా దాడి చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేసింది. ఈ క్రమంలో పట్టణంలోని వేర్వేరు ప్రాంతాల్లో దాదాపు ఇరవై మందిని ఆ కుక్క కరిచి గాయపరిచింది. కుక్క దాడిలో తీవ్రంగా గాయపడిన వారిలో మహిళలు, ఒక చిన్నారి కూడా ఉన్నారు. ఈ అకస్మాత్తు పరిణామంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. బాధితులందరినీ చికిత్స నిమిత్తం వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకేసారి ఇరవై మందికిపైగా క్షతగాత్రులు ఆసుపత్రికి రావడంతో అక్కడ కాసేపు కలకలం రేగింది. బాధితులు చికిత్స కోసం ఆసుపత్రికి క్యూ కట్టారు. వీధి కుక్కల బెడదపై మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Next Story