- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లేపాక్షిలో పిచ్చికుక్క వీరంగం: 12 మందికి గాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం
అనంతపురం జిల్లా హిందూపురం మండలం లేపాక్షిలో ఆదివారం ఒక్కసారిగా కలకలం రేగింది. పిచ్చికుక్క(Mad Dog) గ్రామంలోని జనంపై విచక్షణారహితంగా దాడి చేసింది. దీంతో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు....

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా(Ananthapur District) హిందూపురం మండలం లేపాక్షి(Lepakshi)లో ఆదివారం ఒక్కసారిగా కలకలం రేగింది. పిచ్చికుక్క(Mad Dog) గ్రామంలోని జనంపై విచక్షణారహితంగా దాడి చేసింది. దీంతో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన గ్రామస్థులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఎంపీడీవో శ్రీనివాస్, కార్యదర్శి నాగరాజు తదితరులు బాధితులను పరామర్శించి, వారికి అందుతున్న వైద్య సాయంపై సమీక్షించారు.
PHCలో అత్యవసరంగా టీకాలు
అయితే గాయపడిన వారిలో ఇప్పటికే 9 మందికి స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో (PHC) అత్యవసరంగా టీకాలు వేశారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో వరుస దాడులకు పాల్పడుతూ బెంబేలెత్తించిన ఆ పిచ్చికుక్కను గ్రామస్థులే స్వయంగా చంపివేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లేపాక్షిలో పరిస్థితి సద్దుమణిగినప్పటికీ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.






