- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పేర్ని నానికి బిగ్ షాక్...మచిలీపట్నంలో కేసు నమోదు !
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ పార్టీ సీనియర్ లీడర్ పేర్ని నానికి ( Perni Nani) ఊహించని షాక్ తగిలింది. తాజాగా వైసీపీ

* ఏపీలో రప్పా రప్పా అంటూ కొత్త పంచాయితీ
* పేర్ని నానిపై ఫిర్యాదు చేసిన మచిలీపట్నం టీడీపీ నేతలు
* వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పేర్ని నానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ పార్టీ సీనియర్ లీడర్ పేర్ని నానికి ( Perni Nani) ఊహించని షాక్ తగిలింది. తాజాగా వైసీపీ పార్టీ సీనియర్ నాయకులు పేర్ని నాని పై టీడీపీ నేతలు కేసు పెట్టారు. మచిలీపట్నం ( Machilipatnam) పోలీస్ స్టేషన్ లో లోకల్ టిడిపి నాయకులు... పేర్ని నానిపై ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వంపై రప్పా రప్పా అంటూ హాట్ కామెంట్స్ చేశారు పేర్ని నాని. అయితే ఆ వ్యాఖ్యల పైన పేర్ని నాని పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ... కేసు పెట్టారు టిడిపి నేతలు.
ఇక అంతకు ముందు కూటమి ప్రభుత్వం పై హాట్ కామెంట్స్ చేశారు పేర్ని నాని. రెడ్ బుక్ కు ( Red Book) దీటుగా.. రప్పా రప్పా అంటే వాళ్లకు మనకు తేడా ఏంటి ? చీకట్లో కన్ను కొడితే పనులు అయిపోవాలి అంటూ వ్యాఖ్యానించారు. జగన్ 2.0 ప్రభుత్వంలో కార్యకర్తలకు ఫ్రీ హ్యాండ్ ఉంటుందని ఈ సందర్భంగా వెల్లడించారు. అప్పటి వరకు రప్పా రప్పా బంద్ చేయాలని వెల్లడించారు. మన జోలికి వచ్చే వారి పేర్లు రాసి పెట్టుకోండి అంటూ.. కార్యకర్తలకు పిలుపునిచ్చారు నాని. అయితే ఆ వ్యాఖ్యలు నేపథ్యంలోనే తాజాగా టిడిపి నాయకులు కేసు పెట్టారు.






