లూలు మాల్‌కు బిగ్ షాక్.. భూకేటాయింపు రద్దు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-04-08 13:52:02  IST  )

విజయవాడలో లూలు మాల్ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో భూకేటాయింపుల జరిపింది. అయితే ఈ కేటాయింపుల విషయంలో ప్రస్తుతం ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ కేటాయింపును సవాలు చేస్తూ దాఖలైన పిల్‌పై ఏపీ హైకోర్టువిచారణ జరిపింది. ..

లూలు మాల్‌కు బిగ్ షాక్.. భూకేటాయింపు రద్దు
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ(Vijayawada)లో లూలు మాల్(Lulu Mall) నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(Ap Government) గతంలో భూకేటాయింపుల జరిపింది. అయితే ఈ కేటాయింపుల విషయంలో ప్రస్తుతం ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ కేటాయింపును సవాలు చేస్తూ దాఖలైన పిల్‌పై ఏపీ హైకోర్టు(Ap High Court) విచారణ జరిపింది. దీంతో సదరు భూమి కేటాయింపును రద్దు చేసుకుంటున్నట్లు కోర్టుకు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు తీసుకున్న నిర్ణయాన్ని అధికారికంగా తెలియజేస్తూ, భూకేటాయింపుల రద్దుకు సంబంధించిన ఉత్తర్వులను త్వరలోనే జారీ చేస్తామని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనానికి వివరించారు.

ప్రభుత్వ వివరణ నమోదు

ప్రభుత్వ వివరణను నమోదు చేసుకున్న హైకోర్టు ధర్మాసనం రద్దు ఉత్తర్వుల ప్రతిని సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. గత ప్రభుత్వ నిర్ణయాలపై ప్రస్తుత ప్రభుత్వం పునఃసమీక్ష చేసింది. మాల్ ఏర్పాటు కోసం కేటాయించిన స్థలాన్ని తిరిగి వెనక్కి తీసుకుంది. దీంతో ఈ వివాదానికి తెరపడినట్లైంది.

Next Story