ఏపీ, తెలంగాణకు గుడ్‌న్యూస్.. గ్యాస్ కష్టాల నుంచి ఇక గట్టెక్కినట్లే!

by Gantepaka Srikanth |

తెలుగు రాష్ట్రాల్లో ఎల్‌పీజీ (LPG) గ్యాస్ కొరత ఏర్పడుతుందన్న ఆందోళనల మధ్య ఒక శుభవార్త అందింది.

ఏపీ, తెలంగాణకు గుడ్‌న్యూస్.. గ్యాస్ కష్టాల నుంచి ఇక గట్టెక్కినట్లే!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో ఎల్‌పీజీ (LPG) గ్యాస్ కొరత ఏర్పడుతుందన్న ఆందోళనల మధ్య ఒక శుభవార్త అందింది. పర్షియన్ గల్ఫ్ నుంచి భారీ స్థాయిలో గ్యాస్ నిల్వలతో కూడిన ఒక భారీ నౌక విశాఖపట్నం పోర్టుకు చేరుకుంది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గ్యాస్ సరఫరా మరింత మెరుగుపడనుంది. పర్షియన్ గల్ఫ్ నుంచి సుమారు 47 వేల టన్నుల ఎల్‌పీజీ గ్యాస్‌ను మోసుకొచ్చిన ‘పైన్ గ్యాస్’ (Pine Gas) అనే భారీ నౌక నిజానికి ఒడిశాలోని దమ్రా పోర్టుకు వెళ్లాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గ్యాస్ డిమాండ్, నిల్వల పరిస్థితిని సమీక్షించిన అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్యాస్ కొరత రాకుండా ముందు జాగ్రత్తగా ఈ నౌకను దమ్రా నుంచి విశాఖపట్నం పోర్టుకు మళ్లించారు. ఈ 47 వేల టన్నుల గ్యాస్ నిల్వలు తెలుగు రాష్ట్రాల అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.

వరుసగా వస్తున్న సరఫరాలు..

గత కొద్ది రోజులుగా విశాఖ పోర్టుకు గ్యాస్, ముడిచమురు దిగుమతులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. కేవలం ఐదు రోజుల క్రితం కూడా ముడిచమురు, ఎల్‌పీజీ నిల్వలతో కూడిన నౌకలు విశాఖ తీరానికి చేరుకున్నాయి. ఇప్పుడు మళ్ళీ 'పైన్ గ్యాస్' రాకతో నిల్వలు పుష్కలంగా అందుబాటులోకి వచ్చాయి. పండుగలు లేదా డిమాండ్ పెరిగే సమయాల్లో గ్యాస్ సిలిండర్ల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి రాకుండా ఈ సరఫరాలు దోహదపడతాయి. ముఖ్యంగా పారిశ్రామిక, గృహ వినియోగానికి ఎటువంటి అంతరాయం లేకుండా గ్యాస్ పంపిణీ జరగడానికి ఈ భారీ దిగుమతి సహాయపడుతుందని అధికారులు భావిస్తున్నారు.

Next Story