బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు.. ఏపీకి భారీ నుంచి అతిభారీ వర్షాలు

by Naga Rani Yarlagadda |

బంగాళాఖాతంలో ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనం (Low Pressure) రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వైజాగ్ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.

బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు.. ఏపీకి భారీ నుంచి అతిభారీ వర్షాలు
X

దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనం (Low Pressure) రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వైజాగ్ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. దీని ప్రభావంతో వైజాగ్, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, అల్లూరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. అలాగే పార్వతీపురం, శ్రీకాకుళం, కోనసీమ, వెస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో మరో 48 గంటలపాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.

కాగా.. రేపు, ఈ నెల 24న బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడనున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతోనూ రానున్న రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ముఖ్యంగా కోస్తాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో నేడు భారీ నుంచి అతిభారీ వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, ఉభయ గోదావరి జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది. రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అల్పపీడనాల నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.

Next Story