- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అల్పపీడనంగా బలపడిన ద్రోణి.. ఏపీకి భారీ వర్షసూచన.. తుఫాన్ హెచ్చరిక?
ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి అల్పపీడనంగా (Low Pressure) బలపడినట్లు వాతావరణశాఖ తెలిపింది.

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి అల్పపీడనంగా (Low Pressure) బలపడినట్లు వాతావరణశాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో ఇది మరింత బలపడుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) అంచనా వేసింది. రానున్న మూడ్రోజుల్లో అల్పపీడనం క్రమంగా బలపడుతూ తుఫానుగా మారే అవకాశం ఉందని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. అలాగే ప్రధాన పోర్టుల్లో మూడో నంబర్ హెచ్చరిక జారీ చేసింది.
సముద్రతీరం అల్లకల్లోలంగా ఉంటుందని, రాష్ట్రంలో ఎవరూ సముద్ర తీరాలకు వెళ్లొద్దని సూచించింది. ద్రోణి ప్రభావంతో గడిచిన 24 గంటల్లో సోంపేటలో అత్యధిక వర్షపాతం నమోదైందనట్లు తెలిపింది. తీరం వెంబడి 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలులు వీస్తాయని, కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు వర్షాలు (Coastal Andhra Rains) కురుస్తాయని వెల్లడించింది. రానున్న 48 గంటల్లో.. అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల వైపు కదులుతుందని APSDMA అంచనా వేసింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.






