- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Low Pressure: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
వాయవ్య బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. అల్పపీడనంగా (Low Pressure) మారిందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది.

దిశ, వెబ్‌డెస్క్: వాయవ్య బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. అల్పపీడనంగా (Low Pressure) మారిందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని, ఆ తర్వాతి 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ఒడిశా మీదుగా కదిలే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. అల్పపీడనం ప్రభావంతో నేడు శ్రీకాకుళం నుంచి ఏలూరు జిల్లా వరకూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. మత్స్యకారులు శుక్రవారం (సెప్టెంబర్ 5) సముద్రంలో వేటకు వెళ్లరాదని, భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.
విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు అమరావతి వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ (Orange Alert) జారీ చేసింది. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు (Heavy to Heavy Rains) కురుస్తాయని తెలిపింది. అలాగే పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, కాకినాడ, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.






