Breaking: ఏపీలో లారీల బంద్‌ తాత్కాలిక వాయిదా

by Ramesh Naini |

పెంచిన ఫిట్‌నెస్‌ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్‌‌తో ఏపీలో లారీ ఓనర్ల అసోసియేషన్‌ తలపెట్టిన బంద్‌ తాత్కాలికంగా వాయిదా పడింది.

Breaking: ఏపీలో లారీల బంద్‌ తాత్కాలిక వాయిదా
X

దిశ, డైనమిక్ బ్యూరో: పెంచిన ఫిట్‌నెస్‌ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్‌‌తో ఏపీలో లారీ ఓనర్ల అసోసియేషన్‌ తలపెట్టిన బంద్‌ తాత్కాలికంగా వాయిదా పడింది. అసోసియేషన్‌ నేతలతో చర్చలు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడంతో బంద్‌ను వాయిదా వేస్తున్నట్లు నేతలు ప్రకటించారు. విజయవాడలోని తన కార్యాలయంలో లారీ యజమానులతో రవాణాశాఖ కమిషనర్‌ మంగళవారం చర్చలు జరిపారు. అనంతరం సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు లారీ ఓనర్ల అసోసియేషన్‌ ప్రకటించింది. ప్రస్తుత ఫిట్‌నెస్‌ ఫీజులను నిలుపుదల చేస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించింది. సమస్య పరిష్కారానికి అధికారులు 4 రోజుల సమయం కోరారని, ఈ నేపథ్యంలో నేటి రాత్రి నుంచి తలపెట్టిన లారీల బంద్‌ తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని అసోసియేషన్‌ నేత ఈశ్వరరావు తెలిపారు.

Next Story