చాలా పెద్ద తప్పు చేశావ్ జగన్: లోకేష్

by Gantepaka Srikanth |

టీటీడీకి నెయ్యి సరఫరా వివాదంపై శాసనమండలిలో వైసీపీ సభ్యులు చేసిన నిరసన తీవ్ర వివాదాస్పదమవుతోంది.

చాలా పెద్ద తప్పు చేశావ్ జగన్: లోకేష్
X

దిశ, వెబ్‌డెస్క్: టీటీడీకి నెయ్యి సరఫరా వివాదంపై శాసనమండలిలో వైసీపీ సభ్యులు చేసిన నిరసన తీవ్ర వివాదాస్పదమవుతోంది. వెంకటేశ్వర స్వామి ఫొటోలు(Lord Venkateswara Swamy Photos), ప్లకార్డులు పట్టుకుని పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. నిరసన అనంతరం శ్రీవారి ఫొటోలు ఉన్న ప్లకార్డులను టేబుళ్ల మీద పడేసి వెళ్లడాన్ని కూటమి నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై మంత్రి నారా లోకేష్(Nara Lokesh) సైతం ఘాటుగానే స్పందించారు. ఈ మేరకు లోకేష్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ పెట్టారు. ‘‘శ్రీవారికి చేసిన మహా పాపం కప్పిపుచ్చుకోవడానికి మహాపరాధం చేసావు జగన్. మీకు దేవుడంటే భక్తి లేదు, భయం లేదు. హిందువుల మనోభావాలంటే లెక్కేలేదు. మీ వైసీపీ ఎమ్మెల్సీలు బూట్లు, చెప్పులతో కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి చిత్రపటాలు పట్టుకుని మహాపరాధం చేశారు. అంతే కాకుండా కౌన్సిల్‌లో ప్రదర్శించిన శ్రీవారి ఫొటోలు అక్కడే విసిరేసి వెళ్ళిపోవడం క్షమించరాని పాపం. వెంకన్నతో పెట్టుకోవద్దు జగన్’ అని నారా లోకేష్ హెచ్చరించారు.

Next Story