- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రి నారా లోకేష్ భారీ స్కెచ్.. వైజాగ్‌కు ఎయిర్ ట్రంక్..!
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో డేటా సెంటర్లను నిర్వహిస్తున్న ప్రఖ్యాత హైపర్ స్కేల్ డేటా సంస్థ ఎయిర్ ట్రంక్ సీఈవో రాబిన్ ఖుదాతో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ముంబాయిలో సమావేశమయ్యారు..

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో డేటా సెంటర్లను నిర్వహిస్తున్న ప్రఖ్యాత హైపర్ స్కేల్ డేటా సంస్థ ఎయిర్ ట్రంక్ సీఈవో రాబిన్ ఖుదా(Hyperscale Data Company AirTrunk CEO Robin Khuda)తో రాష్ట్ర మంత్రి నారా లోకేష్(State Minister Nara Lokesh) ముంబై(Mumbai)లో సమావేశమయ్యారు. ఎయిర్ ట్రంక్ ఫ్యూచర్ క్యాంపస్‌ను విశాఖపట్నంలో ఏర్పాటు చేయాల్సిందిగా ఆయన విజ్జప్తి చేశారు. ఎయిర్‌ట్రంక్‌తో సంబంధాలను పునరుద్ధరణ, భారతదేశంలో తదుపరి దశ విస్తరణ, AI- హైపర్‌స్కేల్ మౌలిక సదుపాయాలు, ఆంధ్రప్రదేశ్‌ను ఒక ప్రాధాన్య గమ్యస్థానంగా నిలిపే అంశంపై రాబిన్ ఖుదాతో మంత్రి లోకేష్ చర్చించారు.
ఏఐ, డేటా హైపర్‌స్కేల్ హబ్‌గా వైజాగ్
అనంతరం లోకేష్ మాట్లాడుతూ ‘‘ఏఐ, డేటా హైపర్‌స్కేల్ హబ్‌గా వైజాగ్ ఆవిర్భవిస్తోంది. గూగుల్ ఏఐ హబ్, రిలయన్స్ ఏఐ డేటా సెంటర్, అదానీకనెక్స్ ఇతర ప్రధాన ప్రాజెక్టులు ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయి. డేటా సెంటర్ల ఏర్పాటుకు అన్నివిధాలా అనుకూలతలు కలిగిన విశాఖపట్నం డేటా సెంటర్ హబ్‌గా వేగంగా అభివృద్ధి చెందుతోంది. విశాఖ నగరంలో 6 గిగావాట్ల డేటా సెంటర్లను ఏర్పాటుచేయాలన్నది మా లక్ష్యం. మల్టీ-గిగావాట్ ఏఐ మౌలిక సదుపాయాలు, సంపూర్ణ ఎకోసిస్టమ్ అభివృద్ధిపై మేం దృష్టి సారించాం.’’ అని అన్నారు.
ఇతర ప్రాంతాల్లో లేని కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలు
‘‘భారతదేశంలో మరే ఇతర ప్రాంతాల్లో లేని కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలు మావద్ద అందుబాటులో ఉన్నాయి. డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్ కోసం రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు కూడా సిద్ధమవుతున్నాయి. ఏపీలో ఎయిర్ ట్రంక్ పెట్టుబడులు పెట్టాల్సిందిగా మంత్రి లోకేష్ కోరారు. ఎయిర్‌ట్రంక్‌తో సంబంధాలను పునరుద్ధరణ, భారతదేశంలో తదుపరి దశ విస్తరణ, AI- హైపర్‌స్కేల్ మౌలిక సదుపాయాలు, ఆంధ్రప్రదేశ్‌ను ఒక ప్రాధాన్య గమ్యస్థానంగా నిలిపే అంశంపై మంత్రి లోకేష్ చర్చించారు. రాబిన్ ఖుదా స్పందిస్తూ...ఎయిర్‌ట్రంక్ ఇండియా ప్రణాళికలు, మినా క్లౌడ్‌ఇన్‌ఫ్రాను స్వాధీనం చేసుకున్న తర్వాత దాని ఏకీకరణ, భారతదేశంలో ప్రణాళికాబద్ధమైన పెట్టుబడులు, విస్తరణ రోడ్‌మ్యాప్, కీలక కస్టమర్ సేవలు, హైపర్‌స్కేలర్ అవసరాలపై చర్చించారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలు పరిశీలిస్తాం.’’ అని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.
గత ఏడాది అక్టోబర్‌లోనే మంత్రి లోకేష్ భేటీ
కాగా భారతదేశంలో అగ్రగామి ఏఐ, హైపర్ స్కేల్ డేటా సెంటర్ హబ్‌గా అవతరించాలన్న ఆంధ్రప్రదేశ్ దార్శనికతపై గత ఏడాది అక్టోబర్‌లో మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా తొలిసారి రాబిన్ ఖుదాతో అక్కడ సమావేశమయ్యారు. ఆ తర్వాత భారతదేశంలో విస్తరణ గురించి ఎయిర్ ట్రంక్ బృందం ఆంధ్రప్రదేశ్ ఉన్నతాధికారులతో పలుమార్లు చర్చలు జరిపింది. భారతదేశంలో ఒక ప్లాట్ ఫాం ఏర్పాటు చేశాక విస్తరణపై నిర్ణయం తీసుకుంటామని ఎయిర్ ట్రంక్ బృందం తెలిపింది.
ఇప్పటికే భారత్‌లోకి ఎయిర్‌ట్రంక్
మరోవైపు ఏప్రిల్ 2026లో ఎయిర్‌ట్రంక్ అధికారికంగా భారతదేశంలోకి ప్రవేశించింది. ముంబయి, చెన్నై, హైదరాబాద్‌లలో ప్రాజెక్టులు కలిగి, సుమారు 600 మెగావాట్ల సామర్థ్యంతో ప్రణాళికాబద్ధమైన పైప్‌లైన్‌తోపాటు, బ్లాక్‌స్టోన్ మద్దతు గల డేటా సెంటర్ ప్లాట్‌ఫామ్ లుమినా క్లౌడ్‌ఇన్‌ఫ్రాను ఎయిర్ ట్రంక్ టేకోవర్ చేసింది. ఈ స్వాధీనం ఎయిర్‌ట్రంక్‌కు తక్షణ కార్యకలాపాల స్థావరాన్ని అందిస్తుంది. ఎయిర్ ట్రంక్ ఆసియా పసిఫిక్ వ్యూహంలో భాగంగా భారతదేశాన్ని ఒక ప్రధాన వృద్ధి మార్కెట్‌గా ఆ సంస్థ గుర్తించింది.






