- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభుత్వ పాఠశాల చిన్నారి ప్రతిభకు మంత్రి లోకేష్ ఫిదా
ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న ఓ చిన్నారి ప్రతిభకు మంత్రి నారా లోకేష్ ఫిదా అయ్యారు. పిల్లల ఆసక్తి, తల్లిదండ్రుల ప్రోత్సాహకానికి ఉపాధ్యాయుల కృషి తోడైతే ప్రభుత్వ పాఠశాల్లో ఇలాంటి అద్భుతాలు

దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న ఓ చిన్నారి ప్రతిభకు మంత్రి నారా లోకేష్ ఫిదా అయ్యారు. పిల్లల ఆసక్తి, తల్లిదండ్రుల ప్రోత్సాహకానికి ఉపాధ్యాయుల కృషి తోడైతే ప్రభుత్వ పాఠశాల్లో ఇలాంటి అద్భుతాలు ఇంకెన్నో చూడొచ్చని ట్విట్టర్ లో పోస్టు చేస్తూ వీడియోను షేర్ చేశారు. అనకాపల్లి జిల్లా ఎంపీపీ స్కూల్ బాపాడుపాలెం పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతున్న చిట్టి ఆరాధ్య తన సృజనాత్మకతతో ప్రదర్శించిన మైండ్ మ్యాపింగ్ మైండ్ బ్లోయింగ్ అని కొనియాడు.
చిన్నారి ఆరాధ్యకు ఆశీస్సులు అన్నారు. చిన్నారిని చిచ్చరపిడుగులా తీర్చిదిద్దిన బాపాడుపలెం ఎంపీపీ స్కూల్ ఉపాధ్యాయుడు గంగధర్ రావుకు అభినందనలు తెలిపారు. ఇదిలా ఉంటే లోకేష్ ఏపీలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. విద్యాశాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టిన తరవాత విద్యాసంస్థల బలోపేతానికి ఎంతో కృషి చేస్తున్నారు. అధికారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ సూచనలు, సలహాలు ఇస్తున్నారు.






