కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో లోకేష్ భేటీ

by Thanuru Gopichand |

కేంద్ర విద్యాశాఖ మంత్రి, బీహార్ బీజేపీ ఎన్నికల ప్రచారకర్త ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) పాట్నాలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో లోకేష్ భేటీ
X

దిశ, వెబ్ డెస్క్ : కేంద్ర విద్యాశాఖ మంత్రి, బీహార్ బీజేపీ ఎన్నికల ప్రచారకర్త ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) పాట్నాలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. బీహార్ లో ఎన్డీఏ (NDA) విజయం కోసం ప్రధాన్ అహరహం శ్రమిస్తున్నారని మంత్రి లోకేష్ అన్నారు. గతేడాది హర్యానా, ఒడిశా ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయంలో ప్రధాన్ కీలక పాత్ర వహించారని పేర్కొన్నారు. ప్రస్తుతం బీహార్ లో ఎన్డీఏ విజయం కోసం తీవ్రంగా కృషిచేస్తున్నారని తెలిపారు. బీహార్ లో మరోమారు ఎన్డీఏ సర్కారును గెలిపించేందుకు ప్రధాన్ చేస్తున్న నిర్మాణాత్మక కృషిని మంత్రి లోకేష్ అభినందించారు. బీహార్ లో మరోమారు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కాగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మంత్రి లోకేష్ వెంట ఎంపీలు సానా సతీష్ బాబు, గంటి హరీష్, కలిశెట్టి అప్పలనాయుడు ఉన్నారు.

Next Story