- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈనెల 25న మెగా డీఎస్సీ వేడుక... పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించిన నారా లోకేష్
ఏపీ మెగా డీఎస్సీలో ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలను ఈనెల 25వ తేదీన ప్రభుత్వం అందించనుంది.

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీ మెగా డీఎస్సీలో ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలను ఈనెల 25వ తేదీన ప్రభుత్వం అందించనుంది. ఇందుకోసం భారీ కార్యక్రమం చేపట్టింది. వెలగపూడి సచివాలయం సమీపంలో ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. ఈనెల 19వ తేదీన నియామక పత్రాలు అదే ప్రాంతంలో అందజేయాల్సి ఉండగా భారీ వర్షాల కారణంగా వాయిదా వేశారు. తిరిగి ఈనెల 25న కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు అభ్యర్థులకు డీఈఓ కార్యాలయాల నుంచి ఫోన్లు చేసి సమాచారం తెలియజేస్తున్నారు. మెగా డీఎస్సీ కార్యక్రమానికి రావాలంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను మంత్రి నారా లోకేష్ కోరారు. అసెంబ్లీలోనే ఆయన ఛాంబర్ కు వెళ్లి ఆహ్వా నించారు. డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేతకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డీఎస్సీ విజేతలకు నియామక పత్రాలు అందజేయమన్నారు.






