సచిన్ తో లోకేష్ - బ్రాహ్మణి దంపతుల సెల్ఫీ.. క్రికెట్ దేవుడంటూ పోస్ట్

by Muthe.Rajitha |

ఏపీ మంత్రి నారా లోకేష్ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

సచిన్ తో లోకేష్ - బ్రాహ్మణి దంపతుల సెల్ఫీ.. క్రికెట్ దేవుడంటూ పోస్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ మంత్రి నారా లోకేష్ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. తన చిన్నప్పటి కలల క్రికెట్ రారాజుతో ఫోటో దిగి అత్యంత సంతోషంగా ఫీల్ అయ్యారు. కాగా నేడు ముంబయి వేదికగా జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు కుటుంబంతోసహా వెళ్లారు. అయితే ఆ మ్యాచ్ ను తిలకించేందుకు వచ్చిన భారత సీనియర్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా వచ్చారు. తన ఫేవరేట్ క్రికెటర్ ను అక్కడ చూసిన లోకేష్ దంపతులు... ఆయనతో కరచాలనం చేసి, ఫోటో దిగారు.

ఆ ఫోటోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ ఫ్యాన్ బాయ్ మూమెంట్ అని రాసుకొచ్చారు. మా తరానికి క్రికెట్ దేవుడు, ఎంతోమంది యువతకి ఆదర్శమైన.. సచిన్ ను కలవడం చాలా హ్యాపీగా ఉందని చెప్పుకొచ్చారు. అంతేకాదు లోకేష్ - బ్రాహ్మణి దంపతులు బీసీసీఐ అధ్యక్షులు జైషా దంపతులతో కూడా ఫోటో దిగి, తమ అభిమానులతో పంచుకున్నారు.

Next Story