- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Big Breaking: అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం
అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. అమరావతి చట్టబద్ధత బిల్లుపై సుదీర్భంగా చర్చించిన పార్లమెంట్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు...

దిశ, వెబ్ డెస్క్: అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. అమరావతి చట్టబద్ధత బిల్లుపై సుదీర్భంగా చర్చించిన పార్లమెంట్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. దీంతో ఈ బిల్లును గురువారం రాజ్యసభ ముందుకు తీసుకెళ్లనున్నారు. ఇక ఈ బిల్లుకు ఎన్డీఏ, కాంగ్రెస్ ఎంపీలు మద్దతు తెలిపారు. కానీ రాష్ట్ర పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ మాత్రం వ్యతిరేకించింది. లోక్ సభ నుంచి కూడా వాకౌట్ చేసి రాజధానిపై మరోసారి తనవైఖరేంటో స్పష్టం చేసింది. దీంతో అమరావతికి చట్టబద్ధత తెలపడంపై రాష్ట్ర కూటమి ఎంపీలు ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి చట్టబద్ధత బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్రమంత్రి పెమ్మసాని భావోద్దేగానికి గురయ్యారు.
వారి కన్నీళ్లే ఈ చట్టానికి పునాది: అమరావతి బిల్లుపై పెమ్మసాని భావోద్వేగం
అమరావతి చట్ట బద్ధత బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చలో కేంద్ర మంత్రి, టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రసంగిచారు. ఏపీ రాజధానిగా అమరావతి శాశ్వతంగా ఉంటుందా అన్న అనుమానాలకు ఈ సవరణ ముగింపు పలుకుతుందని ఆయన స్పష్టం చేశారు. అమరావతి అనేది చంద్రబాబు ఆశయం, కల, ధ్యేయమని చెప్పారు. వికేంద్రీకరణ పేరుతో జగన్ ప్రభుత్వం మూడు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టిందన్నారు. అయితే జగన్ అణచివేత చర్యల వల్లే అమరావతి ఒక గొప్ప ఉద్యమంగా మారి దేశం దృష్టిని ఆకర్షించిందని పెమ్మసాని పేర్కొన్నారు.
అభివృద్ధిలో రాజధాని పాత్ర కీలకం..
రాష్ట్ర అభివృద్ధిలో రాజధాని పాత్ర కీలకమని, బెంగళూరు, హైదరాబాద్ తరహాలో అమరావతి సైతం ఏపీ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలవాలని పెమ్మసాని ఆకాంక్షించారు. అమరావతి కోసం భూములిచ్చిన 29 వేల మంది రైతులకు జరిగిన అన్యాయాన్ని గుర్తు చేస్తూ, వారి కన్నీళ్లే ఈ చట్టానికి పునాది అని భావోద్వేగానికి లోనయ్యారు. 'న్యాయస్థానం నుంచి దేవస్థానం' వరకు రైతులు పాదయాత్ర చేసినప్పుడు మహిళలపై జరిగిన లాఠీచార్జీలను ఆయన తీవ్రంగా ఖండించారు. కూటమి ఐక్యత కోసం పవన్ కల్యాణ్ కంకణబద్ధుడై ఉన్నారని పెమ్మసాని తెలిపారు. రాజధాని నిర్ణయం మార్పు కేంద్రం పరిధిలోనే ఉంటుందని, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పెమ్మసాని గుర్తు చేశారు.






