రక్తదానం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చు : మంత్రి సత్యకుమార్

by Thanuru Gopichand |

రక్తదానం చేయండి ప్రాణ దాతలు అవ్వండి.

రక్తదానం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చు : మంత్రి సత్యకుమార్
X

దిశ, వెబ్ డెస్క్ : రక్తదానం (Blood Donation) ద్వారా చాలా మంది ప్రాణాలను కాపాడవచ్చని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ (Satya Kumar Yadav) అన్నారు. వివేకానంద జయంతి (Vivekananda Jayanthi), జాతీయ యువజన దినోత్సవం పురస్కరించుకొని విజయవాడలోని సిద్ధార్థ వైద్య కళాశాలలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య ఆహ్వానితులుగా హాజరయ్యారు. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదాతలను పలకరించారు. స్వచ్ఛందంగా రక్తదానం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ వారిని అభినందించారు. రక్తదాతలకు రక్తదానం చేసినందుకు గానూ నిర్వాహకుల తరపున ప్రశంసా పత్రాలను అందజేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (APSACS), రక్త మార్పిడి సేవలు (BTS) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు, యువత రక్తదానం చేసేందుకు ముందుకు రావడం ప్రశంసనీయం అన్నారు. ఆరోగ్యవంతులైన ప్రతిఒక్కరూ తరచూ రక్తదానం చేస్తుండాలని అభిప్రాయపడ్డారు. తద్వారా అత్యవసర చికిత్స సమయంలో అవసరమైన బాధితులకు రక్తం అందేందుకు వీలు పడుతుందన్నారు. వారికి సకాలంలో సరైన వైద్యం అంది ప్రాణాలు నిలబడతాయన్నారు. అందుకే రక్తదాతలు అంటే ప్రాణ దాతలు కూడా అనుకోవచ్చని పేర్కొన్నారు. యువత రక్తదానం చేయడంలో మరింత ఉత్సాహం కనబరచాలని పిలుపునిచ్చారు.

Next Story