బాలుడి ప్రాణం తీసిన గాలిపటం సరదా

by Ajay Maddhiboyina |

గాలిపటం సరదా ఓ బాలుడి ప్రాణం తీసింది. ఇంటిపై గాలిపటం ఎగరేస్తూ ప్రమాదవశాత్తు కరెంట్ తీగలకు తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.

బాలుడి ప్రాణం తీసిన గాలిపటం సరదా
X

దిశ, వెబ్ డెస్క్: గాలిపటం సరదా ఓ బాలుడి ప్రాణం తీసింది. ఇంటిపై గాలిపటం ఎగరేస్తూ ప్రమాదవశాత్తు కరెంట్ తీగలకు తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన ఏపీలోని అన్నమయ్య జిల్లా గాలివీడు మండలంలో చోటు చేసుకుంది. గోరాంచెరువు గ్రామంలోని బుచ్చే వాండ్లపల్లికి చెందిన ఆనంద శ్రీనివాస్ అనే ఏళ్ల బాలుడు సంక్రాంతి పండుగ సందర్భంగా తమ అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. అక్కడ సరదాగా గాలిపటం ఎగరేసేందుకు ఇంటిపైకి ఎక్కాడు. అయితే గాలిపటం తీగలకు తగలడంతో దానిని తీసే ప్రయత్నం చేయగా కరెంట్ షాక్ కొట్టింది.

దీంతో బాలుడు అక్కడికక్కడే మరణించాడు. బాలుడి మరణంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. పండగపూట ఎంతో సంతోషంగా గడపాల్సిన కుటుంబం రోదనలతో నిండిపోయింది. ఇదిలా ఉంటే గాలిపటాలు ఎగరేస్తూ చాలా మంది ప్రమాదాల బారినపడుతున్నారు. పిట్టగోడలపై గాలిపటాలు ఎగరేస్తూ కొందరు ప్రాణాలు పోగొట్టుకుంటుంటే మరికొందరు చైనా మాంజాలు వాడి ప్రమాదాల బారిన పడుతున్నారు. మరికొంతమంది విద్యుత్ షాక్ ల బారినపడుతూ మరణిస్తున్నారు.

Next Story