రాష్ట్రంలో మద్యం దుకాణాల వేళలు పొడిగింపు

by Vemula.Srinu Prasad |

న్యూ ఇయర్ వేళ మద్యం ప్రియులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది..

రాష్ట్రంలో మద్యం దుకాణాల వేళలు పొడిగింపు
X

దిశ, వెబ్ డెస్క్: నూతన సంవత్సరం(New Year) సందర్భంగా ప్రభుత్వం(Government) కీలక నిర్ణయం తీసుకుంది. సెలబ్రేషన్‌లో భాగంగా మద్యం షాపుల(Wine Shops) వేళలు (Timings)పొడిగిందించింది. డిసెంబర్ 31, జనవరి 1 రాత్రి 12 గంటల వరకు ఈ వేళలనే కొనసాగించనుంది.బార్లు, ఇన్-హౌస్, ఈవెంట్ పర్మిట్ లైసెన్సులకు సైతం వర్తింపు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీటీడీసీ ఆధ్వర్యంలోని లైసెన్సులకు సైతం ఈ ఉత్తర్వులను వర్తింపజేసింది.

న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమైన యువత

మరోవైపు నూతన సంవత్సరం వేడుకలు రాష్ట్ర యువత సిద్ధమైంది. 31న ఈ సంత్సరానికి గుడ్ బై, కొత్త సంవత్సరానికి వెల్ కమ్ చెబుతూ చిన్న, పెద్ద అందరూ కేక్‌లు కట్ చేసి డీజేలు పెట్టుకుని డ్యాన్సులు చేస్తూ సందడి చేయనున్నారు. ఇక మద్యం ప్రియులైతే డిసెంబర్ 31ను మరింతగా సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రతి రోజు కంటే రెండింతలు మద్యాన్ని సేవిస్తారు. అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ కేరింతలు కొడుతూ నూతన సంవత్సరాన్ని ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీపి కబురు అందించింది.

Next Story