లిక్కర్ స్కామ్ కేసు.. విజయవాడకు MP మిథున్ రెడ్డి తరలింపు

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-12 06:47:34  IST  )

లిక్కర్ స్కామ్ కేసు (Liquor Scam Case)లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

లిక్కర్ స్కామ్ కేసు.. విజయవాడకు MP మిథున్ రెడ్డి తరలింపు
X

దిశ, వెబ్‌డెస్క్: లిక్కర్ స్కామ్ కేసు (Liquor Scam Case)లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ మేరకు నిన్న సాయంత్రం ఎంపీ మిథున్ రెడ్డి (MP Mithun Reddy) రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోయారు. అనంతరం పోలీసులు ఇవాళ ఆయనను విజయవాడ (Vijayawada)కు తరలిస్తున్నారు. అయితే, లిక్కర్ స్కాం కేసులో రిమాండ్ ఖైదీగా ఎంపీ మిథున్ రెడ్డికి ఉప రాష్ట్రపతి (Vice President) ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇటీవలే విజయవాడ ఏసీబీ కోర్టు (ACB Court) షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలోనే ఢిల్లీ (Delhi)కి వెళ్లిన మిథున్ రెడ్డి మధ్యంతర బెయిల్ గడువు నిన్నటితో ముగియడంతో తిరిగి రాష్ట్రానికి చేరుకున్నారు. గురువారం సాయంత్రం రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోగా.. నేటితో రిమాండ్ ముగస్తుండటంతో పోలీసులు ఇవాళ మిథున్ రెడ్డిని విజయవాడలోని ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నారు.

Next Story