- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లిక్కర్ స్కామ్ కేసు.. నేడు సిట్ ముందుకు మిథున్ రెడ్డి
వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది.

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. ఈ నేపథ్యంలోనే కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి ఇవాళ సిట్ ఎదుట హాజరుకానున్నారు. ఉదయం 9.30 గంటలకు ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టు చేరుకోనున్న ఆయన 10 గంటలకు విజయవాడలోని సిట్ కార్యాలయానికి వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. విచారణ అనంతరం మిథున్ అరెస్ట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ కోరగా.. అందుకు ఏసీబీ కోర్టు నిరాకరించింది.
కాగా, కేసు ఛార్జిషీటులో ఎంపీ మిథున్ రెడ్డి (MP Mithun Reddy) పేరును చేర్చడంతో ఆయన ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు (High Court)లో ముందుస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ, ఆయన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ మిథున్ రెడ్డి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు (Supreme Court)లో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం ఆ పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టగా.. ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, ఎంపీ మిథున్ రెడ్డి తరఫున తన వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అసలు వ్యక్తిని అరెస్ట్ చేయకుండా కేసులో ఛార్జ్‌షీట్ ఎలా దాఖలు చేస్తారని ఆక్షేపించింది. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది.






