- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Liquor Scam Case: కొత్త డ్రామాకు తెరలేపారంటూ సిట్ సంచలన ప్రకటన
లిక్కర్ కుంభకోణం కేసు(Liquor Scam Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: లిక్కర్ కుంభకోణం కేసు(Liquor Scam Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. లిక్కర్ స్కామ్‌లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి(Chevireddy Bhaskar Reddy)ని ఇరికించేందకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారని తిరుపతి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి(Head Constable Madan Reddy) సంచలన ఆరోపణలు చేస్తూ.. ఏపీ ప్రభుత్వానికి లేఖ రాయడం హాట్ టాపిక్‌గా మారింది. లిక్కర్ స్కామ్ కేసులో తాము చెప్పినట్టు రాసి సంతకం చేయాలని సిట్(SIT) అధికారులు తనపై ఒత్తిడి తెచ్చారని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు లేఖ రాశారు. ఇకపై ఒంటరిగా సిట్ విచారణకు హాజరుకాలేనని స్పష్టం చేశారు. తాజాగా మదన్ రెడ్డి ఆరోపణలపై సిట్ అధికారులు స్పందించారు. మదన్ రెడ్డి ఆరోపణలను ఖండిస్తూ మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ‘సత్యమేవ జయతే. మదన్ రెడ్డి కొత్త డ్రామాకు తెరలేపారు. పోలీసులు వేధించారని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. విచారణలో సిట్ అధికారులు దాడి చేశారన్నది పచ్చి అబద్ధం. కుట్ర కోణాన్ని మొత్తం బహిర్గతం చేస్తాం. కేసిరెడ్డి(Kesireddy) నుంచి చెవిరెడ్డికి ముడుపులు అందాయి. లిక్కర్‌లో వచ్చిన డబ్బులే ఎన్నికల్లో పంచారు. మదన్ రెడ్డి ఆరోపణలపై డీజీపీ స్థాయి అధికారితో విచారణ జరపాలి. తప్పు ఎవరిదైనా యాక్షన్ తీసుకోవాలి’ అని సిట్ అధికారులు డిమాండ్ చేశారు.






