అక్రమ మద్యం చిచ్చు.. రాచమల్లు వర్సెస్ వరదరాజులరెడ్డి

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-03-18 08:44:42  IST  )

ఏపీలో గత ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయాలు జరిగాయి. అయితే ఆ సమయంలో అవకతవలు జరిగినట్లు 2024 ఎన్నికలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గుర్తించి కేసును సిట్‌కు అప్పగించింది...

అక్రమ మద్యం చిచ్చు..  రాచమల్లు వర్సెస్ వరదరాజులరెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)లో గత ప్రభుత్వ హయాంలో మద్యం(Liquor) విక్రయాలు జరిగాయి. అయితే ఆ సమయంలో అవకతవలు జరిగినట్లు 2024 ఎన్నికలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గుర్తించి కేసును సిట్‌(SIT)కు అప్పగించింది. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. అయితే కూటమి, వైసీపీ(Ycp) నేతల మధ్య కూడా మాటలయుద్ధం జరుగుతోంది. నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్న ప్రతిసారి ఈ యుద్ధం మరింత ఘాటుగా జరుగుతోంది.

ప్రొద్దుటూరును గట్టిగానే టచ్ చేసిన మద్యం ఘటన

మరోవైపు మద్యం ఘటన అటు ప్రొద్దుటూరు(Proddutur)ను గట్టిగానే టచ్ చేసింది. దీంతో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు, ప్రస్తుత ఎమ్మెల్యే వరద రాజులరెడ్డి(Mla Varadarajulareddy) భగ్గుమంటున్నారు. ఒకరిని ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శించుకుంటున్నారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని రాచమల్లు చేసిన కామెంట్స్‌పై వరదరాజుల రెడ్డి స్పందించారు. గత ప్రభుత్వ హయాంలో మద్యం ఏరులై పారిందని వరదరాజులరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు కూడా అక్రమ మద్యాన్ని అమ్మారని ఆరోపించారు. వైసీపీ ముఖ్య నేతలు సైం జైలుకు వెళ్లారని గుర్తుచేస్తూ విమర్శించారు. కూటమి ప్రభుత్వంపై మాట్లాడే అర్హత రాచమల్లు లేదని వరదరాజుల రెడ్డి హెచ్చరించారు.

Next Story