- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్ డెస్క్: లిక్కర్ కేసు(Liquor Case)పై మంత్రి సత్యకుమార్ యాదవ్(Minister Satyakumar Yadav) సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ కేసులో అరెస్ట్ చేస్తారన్న భయం మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former Cm Jagan Mohan Reddy)లో కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. సానుభూతి కోసమే జగన్ జనాల్లో తిరుగుతున్నారని ఆరోపించారు. లిక్కర్ కేసులో ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.
జగన్ హయాంలో మద్యం పారదర్శకంగా అమ్మకాలు జరగలేదని, వేల కోట్లలో అక్రమాలకు పాల్పడ్డారు. రూ. 11 కోట్లు లెక్కిస్తూ దొరికిన వ్యక్తి గతంలో జగన్ వెంట తిరగలేదా..? అని ప్రశ్నించారు. ఐదేళ్లలో మద్యం రేట్లు పెంచి ఇష్టారాజ్యంగా వ్యవహరించింది నిజం కాదా అని నిలదీశారు. మద్యం తయారీ డిస్ట్రిలరీలు తమవి కాదా అని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే ప్రజల దృష్టి మరలించేందుకే జగన్ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. ఒక సంవత్సర కాలంలో ఏపీకి రూ. 9 లక్షల కోట్ల ఎంవోయూలు చేసుకున్నామని తెలిపారు. ఒక్క గ్రీన్ హైడ్రోజన్‌లోనే లక్షా 85 వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి చెందడం మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఇష్టం లేదని మంత్రి సత్యకుమార్ విమర్శించారు.






