- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గోవా మాదిరి ఫెస్టివల్! రేపటి నుంచి విశాఖలో లైట్ హౌస్ ఫెస్టివల్ 3.0
తీర ప్రాంత పర్యాటకాన్ని ప్రోత్సహించడంతో పాటు సముద్ర సంబంధ వారసత్వాన్ని ప్రజలకు పరిచయం చేయాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న లైట్ హౌస్ ఫెస్టివల్ 3.0 రేపటి నుంచి విశాఖలో ప్రారంభం కానుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: తీర ప్రాంత పర్యాటకాన్ని ప్రోత్సహించడంతో పాటు సముద్ర సంబంధ వారసత్వాన్ని ప్రజలకు పరిచయం చేయాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న లైట్ హౌస్ ఫెస్టివల్ 3.0 రేపటి నుంచి విశాఖలో ప్రారంభం కానుంది. ఈ నెల 9, 10 తేదీల్లో విశాఖలోని ఎంజీఎం పార్క్ వేదికగా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. పోర్టులు, షిప్పింగ్, ఓడరేవుల శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఫెస్టివల్‌లో లైట్ హౌస్ టూరిజం ప్రమోషన్, తీర ప్రాంత సంస్కృతి ప్రచారం, స్థానిక ప్రజల భాగస్వామ్యంతో వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు. గతంలో గోవా, పూరిలలో నిర్వహించిన తరహాలోనే విశాఖలో కూడా ఈ వేడుకలను నిర్వహించేందుకు పోర్ట్, షిప్పింగ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి సురేష్ గోపి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్, ఎంపీ భరత్ పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.
పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయడం
లైట్ హౌస్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, పోర్ట్ అధికారులతో కలిసి ఏర్పాట్లపై తాజాగా విశాఖ కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా అధికారులు, పోర్ట్ అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేసి లైట్ హౌస్ ఫెస్టివల్‌ను విజయవంతం చేయాలని ఆయన ఆదేశించారు. కాగా, లైట్ హౌస్ ఫెస్టివల్ అనేది భారతదేశంలోని చారిత్రక లైట్ హౌస్‌లను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయడం, తీర ప్రాంత సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమంగా అధికారులు పేర్కొన్నారు.






