ఏపీకి మరో రెండ్రోజులు వర్షసూచన.. ఈ జిల్లాలకు అలర్ట్

by Naga Rani Yarlagadda |

బంగాళాఖాతంలో కొనసాగుతోన్న అల్పపీడనం (Low Pressure) ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై మరో రెండ్రోజులు ఉంటుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది.

ఏపీకి మరో రెండ్రోజులు వర్షసూచన.. ఈ జిల్లాలకు అలర్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: బంగాళాఖాతంలో కొనసాగుతోన్న అల్పపీడనం (Low Pressure) ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై మరో రెండ్రోజులు ఉంటుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (Light to Moderate Rains) కురుస్తాయని వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి,కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

మరోవైపు ధవళేశ్వరం (Dowleswaram Barrage) వద్ద గోదావరి వరద నిలకడగా ఉందని ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 5.57 లక్షల క్యూసెక్కులు ఉందని తెలిపింది. ప్రస్తుతం అధికారులు బ్యారేజీ 175 గేట్లను ఎత్తి నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. గోదావరి, తుంగభద్ర, కృష్ణా నది వరద ప్రవాహం పూర్తి స్థాయిలో వరద తగ్గే వరకు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Next Story