- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుపతిలో చిరుతపులి సంచారం.. వీడియో రికార్డ్ చేసిన భక్తులు
తిరుపతిలో చిరుత పులి సంచారం కలకలం రేపింది....

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి(Tirupati)లో చిరుత పులి(Leopard) సంచారం కలకలం రేగింది. తెల్లవారుజాము 3 గంటలకు అలిపిరి జూపార్క్ రోడ్(Alipiri Zoo Park Road) సమీపంలో భక్తులకు కనిపించింది. రోడ్డుపై ఉన్న చిరుతను కారులో వెళ్తున్న భక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో టీటీడీ అధికారులు(Ttd Officers) అప్రమత్తమయ్యారు. చిరుత కనిపించిన ప్రాంతాన్ని పరిశీలించారు. అడవుల్లోకి వెళ్లిపోయి ఉంటుందని, స్థానికంగా ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి చిరుతల రాకపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మరోవైపు తిరుమల ఘాట్ రోడ్డు(Tirumala Ghat Road)లో చిరుతల సంచారంపై టీటీడీ ప్రత్యేకంగా నిఘా పెట్టాలని భక్తులు కోరుతున్నారు. పలు సందర్భాల్లో చిరుతలు దాడులు చేసిన సంఘటనలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. ఘాట్ రోడ్డులో ప్రయాణించే ప్రయాణికులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.






