ఎస్.వీ యూనివర్సిటీలో చిరుత సంచారం

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-11-07 16:44:33  IST  )

తిరుపతిలోని ఎస్ వీ యూనివర్సిటీలో మరోసారి చిరుత సంచరించడం స్థానికులను భయాందోళనకు గురిచేసింది.

ఎస్.వీ యూనివర్సిటీలో చిరుత సంచారం
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతిలోని ఎస్ వీ యూనివర్సిటీలో మరోసారి చిరుత సంచరించడం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. యూనివర్సిటీ పాపులేషన్ స్టడీస్, ఐ-బ్లాక్ ప్రాంతంలో చిరుత సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఓ భవన నిర్మాణ ప్రాంతంలో కుక్కపై చిరుత దాడిచేసిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. వాటిని చూసిన సెక్యూరిటీ సిబ్బంది భయాందోళన చెందుతున్నారు. చిరుత సంచరించిన దృశ్యాలు చూసిన అధికారులు.. విద్యార్థులు ఒంటరిగా బయటకు రావొద్దని, రాత్రివేళల్లో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

Next Story