శ్రీశైలం పాతాళగంగ వ‌ద్ద‌ చిరుతపులి మృతి

by velandi.Saikiran |

శ్రీశైలంలో చిరుత పులి మృతి చెందిన సంఘటన కలకలం రేపుతోంది. శ్రీశైలం పాతాళ గంగ మెట్ల సమీపాన చిరుత పులి

శ్రీశైలం పాతాళగంగ వ‌ద్ద‌ చిరుతపులి మృతి
X

దిశ‌, వెబ్ డెస్క్ : శ్రీశైలంలో చిరుత పులి మృతి చెందిన సంఘటన కలకలం రేపుతోంది. శ్రీశైలం పాతాళ గంగ మెట్ల సమీపాన చిరుత పులి మృత్యువాత పడింది. మృతి చెందిన చిరుత పులిని చూసి, వెంటనే అలర్ట్ అయిన స్థానికులు... అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. తరచూ ఈ మధ్యకాలంలో పాతాళగంగ మెట్ల సమీపాన ఈ చిరుత తిరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. అంతేకాదు కొన్ని కుక్కలను వేటాడుతూ చిరుత పులి కనిపించిందట.

అయితే ఇవాళ ఉదయం అదే చిరుత పులి మృత్యువాత పడడం అనేక అనుమానాలకు తెరలేపుతోంది. ఆ చిరుత పులి సహజంగా మరణించిందా ? లేక విష ప్రయోగం జరిగిందా ? స్మగ్లర్లు ఏమైనా చేశారా ? అనే కోణంలో అటవీ శాఖ అధికారులు విచారణ చేస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు... అక్కడ పరిసరాలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రేపు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఉన్న నేపథ్యంలో... శ్రీశైలంలో ఇలాంటి సంఘటన జరగడం కలకలం రేపుతోంది. ఇక ఈ సంఘ‌ట‌న‌పై ఇంకా వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Next Story