- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు పవన్ కల్యాణ్ అధ్యక్షతన శాసనసభాపక్ష సమావేశం
ఏపీ (AP) లో అసెంబ్లీ సమావేశాల (Assembly Sessions) నేపథ్యంలో జనసేన పార్టీ (Janasena Party) శాసనసభ పక్ష సమావేశం (Floor Meeting) నిర్వహించనున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఏపీ (AP) లో అసెంబ్లీ సమావేశాల (Assembly Sessions) నేపథ్యంలో జనసేన పార్టీ (Janasena Party) శాసనసభ పక్ష సమావేశం (Floor Meeting) నిర్వహించనున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) అధ్యక్షతన నిర్వహించాలని నిర్ణయించారు. మంగళగిరి (Mangalagiri) లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం (Janasena Party Office) లో మంత్రులు (Ministers), ఎమ్మెల్యేలు (MLAs), ఎమ్మెల్సీ (MLCs) లతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో జనసేన ప్రజా ప్రతినిధులకు బడ్జెట్ (AP Budget) పై అవగాహన.. అసెంబ్లీ (Assembly) లో ఎలా వ్యవహరించాలి, బడ్జెట్ పై ఎలా చర్చించాలి అనే అంశాలపై పవన్ దిశా నిర్దేశం (Direction) చేయనున్నారు.
కాగా ఈ నెల 22 నుంచి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అదే రోజు గవర్నర్ (Governor) ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం ఈ 24వ తేదీన 2025-26 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నదని తెలుస్తోంది. 15 రోజులకు తగ్గకుండా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం (NDA Government) యోచనలో ఉంది. బీఏసీ సమావేశం (BAC Meeting) తర్వాత అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలని అనేది తెలియనుంది. ఇదిలా ఉండగా అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మాజీ సీఎం, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి (YSRCP Leader YS Jagan Mohan Reddy) అసెంబ్లీ రానున్నారని వార్తలు ఊపందుకున్నారు. దీంతో ఈ విడత సమావేశాలు ఎలా ఉండబోతున్నాయని రాజకీయాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.






