దిగ్గజ క్రికెటర్ కన్నుమూత.. సంతాపం తెలుపుతున్న ప్రముఖులు

by Gantepaka Srikanth |

క్రీడా సమాజంలో విషాదం చోటుచేసుకున్నది. ఆంధ్రా రంజీ టీమ్ మాజీ కెప్టెన్ వెలుగోటి రాజగోపాల్ యచేంద్ర(94) కన్నుమూశారు.

దిగ్గజ క్రికెటర్ కన్నుమూత.. సంతాపం తెలుపుతున్న ప్రముఖులు
X

దిశ, వెబ్‌డెస్క్: క్రీడా సమాజంలో విషాదం చోటుచేసుకున్నది. ఆంధ్రా రంజీ టీమ్ మాజీ కెప్టెన్ వెలుగోటి రాజగోపాల్ యచేంద్ర(94) కన్నుమూశారు. తిరుపతి(Tirupati) వెంకటగిరి రాజకుటుంబానికి చెందిన ఆయన 1956లో ట్రావెన్‌కోర్-కొచ్చి జట్టుతో మ్యాచ్‌తో కెరీర్ ప్రారంభించారు. బ్యాటింగ్, లెగ్ స్పిన్ బౌలింగ్‌తో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. క్రికెట్ కెరీర్‌లో మొత్తం రాజగోపాల్ యచేంద్ర 15 రంజీ మ్యాచులు ఆడారు. 1963-1965 మధ్య ఆంధ్రా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి జట్టుకు మంచి గుర్తింపును తీసుకొచ్చారు. తాజాగా వెలుగోటి రాజగోపాల్ యచేంద్ర(Velugoti Rajagopal Yachendra) మృతి పట్ల ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్(Andhra Cricket Association) అధ్యక్షుడు కేశినేని శివనాథ్(చిన్ని) సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. అంతేకాదు.. యచేంద్ర మృతి వార్త తెలిసిన క్రికెట్ అభిమానులు కూడా సంతాపం ప్రకటిస్తున్నారు. ఆయన గేమ్‌ను గుర్తుకుచేసుకుంటున్నారు.

Next Story