చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారు.. సర్కార్‌పై మాజీ మంత్రి అంబటి ఫైర్

by Kema Shiva Kumar |

కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులకు పాల్పడుతోందని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) అన్నారు.

చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారు.. సర్కార్‌పై మాజీ మంత్రి అంబటి ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులకు పాల్పడుతోందని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) అన్నారు. ఇవాళ ఆయన గుంటూరు (Guntur)లో మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కావాలనే కాకాణి గోవర్ధన్ రెడ్డి (Kakani Goverdhan Reddy)పై అక్రమ కేసులు పెట్టించారని ఆరోపించారు. కావాలనే ఆయనపై రాజకీయంగా కక్ష తీర్చుకుంటున్నారని ఫైర్ అయ్యారు. అకారణంగా సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస రావుపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింది కేసు పెట్టించారని కామెంట్ చేశారు. చట్టాలను ప్రభుత్వంతో పాటు పోలీసులు కూడా పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. బెయిల్ రాకూడదనే ఉద్దేశంతోనే ఇలా వరుసగా వైసీపీ నాయకులపై కేసులు బనాయిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.

Next Story