- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అర్థరాత్రి రోడ్డుప్రమాదం.. వాహనంలో రూ.8 కోట్ల బంగారం.. షాకైన పోలీసులు
జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.

దిశ, వెబ్ డెస్క్: జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. విజయవాడ (Vijayawada) నుంచి నెల్లూరు వెళ్తున్న వ్యాన్ అకస్మాత్తుగా ప్రకాశం జిల్లా ఒంగోలు తాలూకా పరిధిలో దశరాజుపల్లి వద్ద ముందుండిన లారీని ఢీ కొట్టింది. వ్యాన్‌లో ముగ్గురు ప్రయాణికులు.. డ్రైవర్, సెక్యూరిటీ గార్డు, సెక్యూరిటీ సూపర్‌వైజర్ ఉన్నారు. ప్రమాదంలో డ్రైవర్, గార్డు గాయపడగా, సూపర్‌వైజర్ నాగరాజు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. రాత్రివేళ రహదారిపై ప్రమాదాలు జరుగటం సాధారణం కానీ, ఆ వ్యాన్‌లో వారు ఏం తరలిస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
అందులో ఏకంగా రూ.8 కోట్ల విలువైన బంగారు (Gold) ఆభరణాలున్నాయి. బంగారం విక్రయించే ఓ ప్రముఖ సంస్థ విజయవాడ నుంచి నెల్లూరులోని తమ బ్రాంచికి ఓ వాహనంలో ఆభరణాలు తరలిస్తుండగా ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని త్రిపురాంతకం సీఐ గోసాని అసాన్ ఆధ్వర్యంలో అప్రమత్తమయ్యారు. బంగారం భద్రతకు టోయింగ్ వాహనంతో వ్యాన్‌ను ఒంగోలు తాలూకా స్టేషన్‌కు తరలించారు. అయితే, భారీగా బంగారు ఆభరణాలు తరలించే వాహనానికి ప్రమాదం జరుగటంతో ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆభరణాల గురించి పూర్తిగా క్లారిటీ రావాల్సిన అవసరముండటంతో విచారణ ప్రారంభించారు. శుక్రవారం ఉదయం ఆ సంస్థ ప్రతినిధులు పోలీసుస్టేషన్‌కు చేరుకుని సరైన డాక్యుమెంట్లు చూపించి, వాటిని మరో వాహనంలో నెల్లూరుకు తరలించారు.






