- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చివరి నిమిషంలో ట్విస్ట్.. డిప్యూటీ CM పవన్ బాపట్ల పర్యటన రద్దు
జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఇవాళ డిప్యూటీ సీఎం పర్యావరణ, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) బాపట్లలో పర్యటించాల్సి ఉంది.

దిశ, వెబ్‌డెస్క్: జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఇవాళ డిప్యూటీ సీఎం పర్యావరణ, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) బాపట్లలో పర్యటించాల్సి ఉంది. అయితే, చివరికి నిమిషంలో ఆయన పర్యటన రద్దు అయింది. బాపట్ల (Bapatla) జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జరా చేసని నేపథ్యంలో ఆయన టూర్‌ను క్యాన్సిల్ చేసుకున్నారు. అదేవిధంగా హెలికాప్టర్ (Helicopter) ప్రయాణానికి వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో చివరి నిమిషంలో పర్యటన రద్దు అయింది. అయితే, అటవీ అమర వీరుల దినోత్స వేళ వారి చేసిన త్యాగాలకు గుర్తుగా సూర్యలంక (Surya Lanka) రోడ్డులోని నగరవనం అటవీ పార్కులో స్థూపాన్ని డిప్యూటీ సీఎం పవన్ ఆవిష్కరించాల్సి ఉంది. రాజమండ్రి నుంచి స్పెషల్‌గా తెప్పించిన తాళపత్ర గ్రంథం మొక్కలను సూర్యలంక తీర ప్రాంతంలో నాటాలనుకున్నారు. కానీ, వాతావరణ అనుకూలించపోవడంతో పవన్ బాపట్ల పర్యటన రద్దు అయింది.






