- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య రాకపోకలు బంద్
by Vemula.Srinu Prasad |
శ్రీశైలం రోడ్డుపై విరిగి పడిన కొండచరియలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి..

X
దిశ, వెబ్ డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాలపై తుపాను ప్రభావం(Cyclone Effect) భారీగా పడింది. పలు ప్రాంతాల్లో భారీగా కురిసిన వర్షాలతో జలాశయాలు(Projects), వాగులు, వంకలు ఉధృతిగా ప్రవహిస్తున్నాయి. కొన్ని ఏరియాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లి రోడ్లపై వరద నీరు ప్రవాహిస్తోంది. మరోవైపు కొండ ప్రాంతాల్లో చరియలు విరిగి రోడ్డుపై పడ్డాయి. శ్రీశైలం(Srisalam)లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), తెలంగాణ(Telangana) మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. ఈ మేరకు నల్లమల(Nallamala)లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు నిషేధం విధించారు. తెలంగాణ(Telangana) వైపు నుంచి వచ్చే వాహనాలు నిలిపివేశారు. దీంతో రోడ్డుపై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ప్రస్తుతం వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.
Next Story






