- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉర్సా కంపెనీకి భూ కేటాయింపులు.. వైసీపీ, టీడీపీ పార్టీల మధ్య ట్విట్టర్ వార్
కూటమి ప్రభుత్వం ఉర్సా కంపెనీకి భూములు కేటాయించడం రాష్ట్ర వ్యాప్తంగా దూమారం రేగుతోంది.

దిశ, వెబ్ డెస్క్: కూటమి ప్రభుత్వం ఉర్సా కంపెనీ (Ursa Compeny)కి భూములు కేటాయించడం రాష్ట్ర వ్యాప్తంగా దూమారం రేగుతోంది. దీనిపై వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ అంశంపై టీడీపీ, వైసీపీ సోషల్ మీడియాల మధ్య ట్వీట్టర్ వార్ (Twitter War) కొనసాగుతోంది. రాష్ట్రంపై పగబట్టి, దోచుకుంటున్నది ఎవరో ప్రజలందరికీ తెలుసని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) ట్వీట్ చేసింది. ఊరు పేరు లేని కంపెనీకి రూ. 3 వేల కోట్ల విలువైన భూమిని దారాదత్తం చేస్తున్నారంటూ వైసీపీ చేసిన ట్వీట్ కి అందరూ నీలాగా భూములు కొట్టేసే వాళ్లు అనుకుంటే ఎలా జగన్ అని తెలుగు దేశం పార్టీ (Telugudesam Party) రిప్లై ఇచ్చింది. దీనిపై వైసీపీ పార్టీ స్పందిస్తూ.. టీడీపీకి కౌంటర్ ఇచ్చింది.
ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్రంపై పగబట్టింది ఎవరో.. రాష్ట్రాన్ని దోచుకుంటున్నది ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు చంద్రబాబు (Chandrababu), నారా లోకేష్ (Nara Lokesh)? అని రాసుకొచ్చింది. అంతేగాక ఉర్సా రూ.5,728 కోట్లు పెట్టుబడితో, 2,500 ఉద్యోగాలు టార్గెట్ అంటున్నారు కదా.. ఊరు పేరు లేని కంపెనీ అన్నివేల కోట్లు ఎలా పెట్టుబడి పెడుతుంది? అన్ని ఉద్యోగాలు ఎలా ఇస్తుంది? అని ప్రశ్నించింది. ఇక ఉర్సాకు నిబంధనల ప్రకారమే భూ కేటాయింపులు అంటున్నారు కదా? ఆ నిబంధనలు ఏంటో పూర్తి వివరాలు ఎందుకు చెప్పడం లేదు? అని నిలదీసింది. దీన్ని బట్టి తెలియడం లేదా? డొల్ల కంపెనీల పేరుతో మీరు ఎలా దోచుకోవాలని చూస్తున్నారో అని చెప్పడానికి అని సంచలన ఆరోపణలు చేసింది.
కాగా అంతకముందు టీడీపీ వైసీపీ ట్వీట్ పై.. రాష్ట్రం పై పగబట్టిన వైఎస్ జగన్ ముఠా అంటూ.. మొన్న రాజధాని అమరావతిని ఆపటానికి ప్రపంచ బ్యాంకుకి లేఖలు రాశారని, నేడు విశాఖకి రాబోతున్న పెట్టుబడులు ఆపటానికి కుట్రలు చేస్తున్నారని విమర్శించింది. ఉర్సా పై కట్టు కథలు.. నిబంధనల ప్రకారమే ఉర్సా కి కేటాయింపులు అని చెప్పింది. రూ.5,728 కోట్లు పెట్టుబడితో, 2,500 ఉద్యోగాలు టార్గెట్ అని, రెండేళ్ళలో ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని నిబంధన ఉన్నదని, చేయని పక్షంలో, ప్రాజెక్ట్ రద్దు చేసి భూములు వెనక్కి అని స్పష్టం చేసింది. ఇంత స్పష్టంగా నిబంధనలు ఉన్నా, వైసీపీ కాకమ్మ కబుర్లు చెబుతోందని, అందరూ నీ లాగా వ్యాన్ పిక్, సరస్వతి, బ్రాహ్మణి, లేపాక్షి పేరుతో భూములు కొట్టేసే వాళ్ళు అనుకుంటే ఎలా జగన్ ? అని టీడీపీ రాసుకొచ్చింది.






