మొదటి మహిళా బాధితురాలిని నేనే: లక్ష్మీపార్వతి సంచలన ఆరోపణలు

by Vemula.Srinu Prasad |

వైసీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ..

మొదటి మహిళా బాధితురాలిని నేనే:  లక్ష్మీపార్వతి సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి(YCP General Secretary Nandamuri Lakshmi Parvathi) కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో చంద్రబాబు రాజకీయాల వల్ల ప్రభావితమైన మొదటి మహిళా బాధితురాలిని తానేనని ఆమె పేర్కొన్నారు. నాడు బ్రిటిష్ వారు అనుసరించిన నిరంకుశ విధానాలనే నేడు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తోందని ఆమె ఆరోపించారు.

ప్రతి కుటుంబానికి ఆయన కొండంత అండ

గత ఐదేళ్ల వైఎస్ జగన్ పాలనలో ప్రతి కుటుంబానికి కొండంత అండ లభించిందని, అయితే ప్రస్తుత ప్రభుత్వం మహిళలను రోడ్డున పడేసేలా ప్రవర్తిస్తోందని లక్ష్మీపార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో మహిళల రక్షణ కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 'దిశ' యాప్‌ను కూడా చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆమె మండిపడ్డారు.

ఎడారి ఒంటె చంద్రబాబు

‘‘చంద్రబాబు రాజకీయ శైలిని ఆమె 'ఎడారి - ఒంటె' కథతో పోల్చారు. అవసరమైనప్పుడు కాళ్లు పట్టుకోవడం, అవసరం తీరాక జుట్టు పట్టుకోవడం ఆయనకు అలవాటని విమర్శించారు. గతంలో ప్రమాణస్వీకారం చేసి మరీ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, పార్టీని లాక్కున్న చరిత్ర చంద్రబాబుదే.’’ అని ఆమె ధ్వజమెత్తారు.

Next Story