మీ నాన్నకు మచ్చ తెస్తున్నావు : భాను ప్రకాష్ పై లక్ష్మీ పార్వతి ఫైర్

by Muthe.Rajitha |

నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్(MLA Bhanu Prakash) వైసీపీ నాయకురాలు రోజా(Roja)పై చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

మీ నాన్నకు మచ్చ తెస్తున్నావు : భాను ప్రకాష్ పై లక్ష్మీ పార్వతి ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్ : నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్(MLA Bhanu Prakash) వైసీపీ నాయకురాలు రోజా(Roja)పై చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కాగా భానుప్రకాష్ వ్యాఖ్యలపై ఎన్టీఆర్ భార్య, వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి(Lakshmi Parvathi) ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ నాన్న కృష్ణమనాయుడు ఎంతో నీతిగా బ్రతికాడని, ఎవరినీ వ్యక్తిగతంగా దూషించలేదని అలాంటి వ్యక్తికి మచ్చ తెస్తున్నవాని మండిపడ్డారు. మనిషిగా పుట్టినవాడు సంస్కారంతో ఉండాలని, మహిళలపై అందునా అక్కలాంటి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి మాటలు మాట్లాడితే మంత్రి పదవి ఇస్తారని ఆశాపడుతున్నావేమో గాని, నీ విలువ పోతుందని గుర్తించమని హితవు పలికారు. రాజకీయాల్లో వచ్చి అన్నీ అక్రమ పనులు, అక్రమ సంపాదన చేస్తున్నావని, ఏదోకరోజు ఇవన్నీ నిన్ను ముంచేస్తాయని లక్ష్మీ పార్వతి హెచ్చరించారు.

Next Story