- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘పవన్ కల్యాణ్ మా పెద్ద కుమారుడు’ అంటూ పాలాభిషేకం
‘పవన్ కల్యాణ్ మా పెద్ద కుమారుడు’ అంటూ కురుడి గ్రామస్తులు పాలాభిషేకం చేశారు..

దిశ, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan)పై ప్రజలు వీరాభిమానం చూపిస్తున్నారు. తమ ప్రాంత సమస్యలను పవన్ కల్యాణ్ పరిష్కరించారంటూ ఆయన చిత్రపటానికి అల్లూరి జిల్లా(Alluri District) అరకు నియోజకవర్గం సాగర్ పంచాయతీ కురిడీ(Kuridi) గ్రామస్తులు పాలాభిషేకం చేశారు. గత ఐదేళ్లలో ఈ గ్రామంలో రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ సమస్య వెంటాడింది.
అయితే ఈ గ్రామంలో 2018లో పవన్ కల్యాణ్ రచ్చ బండ కార్యక్రమం నిర్వహించారు. సమస్యలను తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో గ్రామాన్ని సందర్శించారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలంటూ అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు వేగంగా అడుగులు వేశారు. గ్రామానికి రోడ్డు వేస్తున్నారు. పనులు చకాచకా జరుగుతున్నాయి. తాగునీరు, డ్రైనేజీ పనులు సైతం పూర్తి అయ్యాయి. ఈ మేరకు గ్రామానికి తాగునీరు సరఫరా అవుతోంది. దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. గతంలో గెడ్డపైకి వెళ్లి నీళ్లు తెచ్చుకునేవాళ్లమని, పవన్ కల్యాణ్ బాధను ప్రత్యక్షంగా చూశారని, మంచినీటి సమస్యను పరిష్కరించారంటూ గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. తమ గ్రామాన్ని బాగా అభివృద్ధి చేశారని పేర్కొన్నారు.






