‘పాత రోజులు మర్చిపోయావా’..: ఆదోని ఎమ్మెల్యేకి వైసీపీ కార్యకర్త బెదిరింపు

by Vemula.Srinu Prasad |

కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. స్థానిక ఎమ్మెల్యే పార్థసారథిని లక్ష్యంగా చేసుకుంటూ వైసీపీకి చెందిన ఓ కార్యకర్త సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి...

‘పాత రోజులు మర్చిపోయావా’..: ఆదోని ఎమ్మెల్యేకి వైసీపీ కార్యకర్త బెదిరింపు
X

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లా ఆదోని(Kurnool District Adoni) నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. స్థానిక ఎమ్మెల్యే పార్థసారథి(MLA Parthasarathy)ని లక్ష్యంగా చేసుకుంటూ వైసీపీ(Ycp)కి చెందిన ఓ కార్యకర్త సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అనుచరుడిగా చెప్పుకుంటున్న సదరు వ్యక్తి, "చావడానికైనా.. చంపడానికైనా సిద్ధం" అంటూ అత్యంత ఘాటుగా స్పందించడం చర్చనీయాంశమైంది. అంతేకాదు ఈ బహిరంగ బెదిరింపులు స్థానికంగా కలకలం సృష్టిస్తున్నాయి.

ఎమ్మెల్యేను నేరుగా ప్రశ్నిస్తూ...

సదరు కార్యకర్త తన పోస్ట్‌లో ఎమ్మెల్యేను నేరుగా ప్రశ్నిస్తూ.. "మిమ్మల్ని ఎవరు కాపాడుతారు?. చంద్రబాబా లేక పవన్ కళ్యాణా?" అంటూ సవాల్ విసిరారు. పాత రోజులను గుర్తుచేసుకోవాలని హెచ్చరించారు. తమ జోలికి వస్తే తట్టుకోలేరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ ఘటనపై కూటమి నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి బెదిరింపులకు చోటు లేదని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తున్న సదరు కార్యకర్తపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ఈ మాటల యుద్ధం ఆదోని రాజకీయాల్లో మరింత ఉత్కంఠను పెంచుతోంది.

Next Story